October 16, 2025
News Telangana
Image default
Telangana

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శం,గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి,అక్టోబర్ 01(న్యూస్ తెలంగాణ):-

హైదరాబాద్ హైటెక్స్ ఎక్సిబిషన్ సెంటర్‌లో బాలీవుడ్ కళాకారుడు మనోజ్ ముంతాషిర్, నిర్వహించిన మేరా దేశ్ పహలే ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోదీ ప్రదర్శించిన కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు.దేశం కోసం,జన హితం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ, సేవలు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోనున్నట్లు తెలిపారు.
వడ్నగర్‌లో సాధారణ కుటుంబంలో పుట్టి బాల్యం నుంచి, ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రాచారక్‌గా కష్టసాధనతో ఎదుగుతూ, 1992లో లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన సాహస ఘట్టం వరకు ప్రతి అంకం మన కళ్లముందు ప్రత్యక్షంగా ఆవిష్కృతమైంది.
తరువాత గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపి, చివరికి దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో మూడు సార్లు వరుసగా ప్రజల విశ్వాసం పొందిన ప్రధానిగా ఆపరేషన్ సిందూర్, రామ్ మందిర్, ఆర్టికల్ 379 మరియు ట్రిపుల్ తలాక్ వంటి మహా ఘట్టాలతో భారత్‌ను గర్వపడేలా చేసిన మోదీ జీ జీవన గాధను ఈ సంగీత రూపకంలో అద్భుతంగా ప్రతిబింబించారు. దేశ భక్తిని రగిలించే సంగీతం, మనసును కదిలించే నటన, కట్టిపడేసే కథనం ఇవన్నీ కలసి మోదీ జీ జీవితం ఒక యుగప్రేరణగా మిగిలేలా చేశాయి. ప్రధాని మోదీ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలు, స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని పద్య కథనం, ప్రత్యక్ష సంగీతం కలగలిపి ఉద్వేగభరితంగా ప్రేక్షకులకు అందించారు. ప్రధాని జీవితంలోని విశేషాలను తెలిపే చిత్రాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. హైదరాబాద్ వంటి అద్భుతమైన నగరంలో ప్రదర్శన నిర్వహించడంపై నాటక నిర్మాత మనోజ్ తెలిపారు.రెండు గంటల పాటు సాగే మేరా దేశ్ పహలే నాటకాన్ని దేశంలోని ముఖ్య నగరాలన్నింటిలో ప్రదర్శిస్తామని వివరించారు.దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకపోతున్న మోడీ అడుగు జాడల్లో నడుస్తూ గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు.గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జీవిత ప్రయాణాన్ని వర్ణిస్తూ రూపొందించిన “మేరా దేశ్ పహలే – ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ శ్రీ నరేంద్ర మోదీ” పేరిట అపురూపమైన ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు,మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు,కేంద్ర , బొగ్గు & గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు,ఎంపీలు ఈటెల రాజేందర్ , రఘునందన్ రావు , ధర్మపురి అరవింద్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు గారు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ గౌతమ్ జీ, శ్రీ ప్రేమేందర్ రెడ్డి,తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జ్, శ్రీ రవి కుమార్ యాదవ్ గారు,రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు,రంగారెడ్డి జిల్లా సేవా పక్షం కన్వీనర్ రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంత్ నాయక్,గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పద్మ పురస్కార గ్రహీతలు, సినీ ప్రముఖులు,రంగారెడ్డి జిల్లా బీజేపీ పదాధికారులు,ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చ.. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం..!

News Telangana

ఎల్లారెడ్డిపేట్ పోలీసుల సాహసం

News Telangana

ఘనవిజయం సాధించిన సునీత లక్ష్మారెడ్డి

News Telangana

Leave a Comment