
పినపాక నియోజకవర్గ ప్రతినిధి( న్యూస్ తెలంగాణ) అక్టోబర్ 03:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు, అశ్వాపురం, పినపాక, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో స్థానిక ఎన్నికలు విశేష ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్ హైకోర్టు తీర్పుచుట్టు నెలకొన్న అనిశ్చితి. కొందరు ఆశావాహులు ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టగా.. మరికొందరు తీర్పు వచ్చేవరకు డబ్బులు ఖర్చు చేయకుండా వేచి చూద్దాం అన్న ధోరణిగా ఉన్నట్లు తెలుస్తోంది. నాయకులు అంతర్గతంగా వ్యూహాలను రచిస్తూ ..గ్రామాలలోనీ ప్రభావవంతమైన కుటుంబాలను, కుల నాయకులను సంప్రదించే ప్రణాళికలు రచించుకుని పనిలో బిజీ బిజీగా నిమగ్నమవుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయాలా? లేక తీర్పు వచ్చేవరకు వేచి చూడాలా..? అన్న డైనమా లో ఉన్నారు. జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల కోడ్ పగడ్బందీగా అమలు జరుగుతోంది. ఏది ఏమైనా 9వ తేదీన ఇదే నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల నిర్వహించడం జరుగుతుంది. 8వ తేదీ కోర్టు ఆదేశాలు ఏ విధంగా వస్తాయో వేచి చూడాలి.