
- అభయ హెల్త్ ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా అత్యుత్తమ వైద్య సేవలు
- అతి తక్కువ ఫీజుతో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం
మేడిపల్లి అక్టోబర్ 04 ( న్యూస్ తెలంగాణ)
మానవసేవే మాధవ సేవగా భావించి, అభయ హెల్త్ ట్రస్ట్ హాస్పిటల్ స్థాపించి నిరుపేదలకు అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గోలి వేణు రెడ్డిని పీర్జాదిగూడ 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. రేషన్ కార్డ్ ఉన్నవారికి ఉచితంగా, ఇతరులకు 50 రూపాయల ఓపి ఫీజు, ఇతర పరీక్షలు, శస్త్ర చికిత్సలకు సాధారణ ఫీజులతో ఎంతోమంది పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నందుకు డాక్టర్ వేణు రెడ్డిని అభినందిస్తూ భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలు పేదలకు అందించాలని మద్ది యుగేందర్ రెడ్డి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అశోక్ రెడ్డి, ఆదిత్య మోహన్, యాదిరెడ్డి, జంగారెడ్డి, హరినాథ్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, మాధవరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.