
మేడిపల్లి అక్టోబర్ 04( న్యూస్ తెలంగాణ) దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 25వ డివిజన్ లోని శ్రీ సాయి నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ మేడిపల్లి హనుమాన్ దేవాలయం యందు ప్రతిష్ఠించిన శ్రీ దుర్గాదేవి అమ్మవారు 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారిని పీర్జాదిగూడ మాజీ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం విజయదశమి దసరా పండుగ సందర్భంగా శమిపూజ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పాల్గొని అలైబలై కార్యక్రమం నిర్వహించి,అన్న వితరణ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ పూజ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రవీందర్ చారీ,కార్యదర్శి హరిందర్ యాదవ్,ఉత్సవ కమిటీ సభ్యులు ప్రభాకర్ చారి, లక్ష్మి,సరస్వతి,భానుప్రకాష్, నాగిరెడ్డి,కమిటీ సభ్యులు,
25వ డివిజన్ కాలనీల అధ్యక్షకార్యదర్శులు, మహిళలు,పెద్దలు,అందరూ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు..
