
రాయికల్ అక్టోబర్ 4 , న్యూస్ తెలంగాణ :- స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.రాయికల్ పట్టణంలో ముఖ్య కార్యకర్తలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు.రాయికల్ మండలంలోని 14 ఎంపిటిసి స్థానాల్లో అత్యధిక మెజార్టీ సాధించి ఎంపిపి పీఠం కైవసంతో పాటు,జడ్పిటిసి సైతం కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు.నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుందన్నారు.కార్యకర్తలు అభ్యర్థుల గెలుపుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,మాజీ సర్పంచులు తంగెళ్ల రమేష్,అత్తినేని గంగారెడ్డి,నాయకులు కొయ్యేడి మహిపాల్,బాపురపు నర్సయ్య,చింతలపల్లి గంగారెడ్డి,తలారి రాజేష్,కోడిపెళ్లి ఆంజనేయులు,బొడ్గం అంజిరెడ్డి,ఏలేటి జలంధర్ రెడ్డి, జగదీశ్వర్,సంతోష్,రాజేందర్ సాగర్,రామ్ రెడ్డి,తిరుపతి,రమేష్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.