
పినపాక నియోజకవర్గ ప్రతినిధి( న్యూస్ తెలంగాణ) అక్టోబర్ 06: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ పదవి జనరల్ కావడంతో.. ఆ కుర్చీ చుట్టే పాలిట్రిక్స్ జోరుగా జరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరికి దక్కుతుందోనని ఇప్పటినుండే ప్రజలు, రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గత ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ కాగా.. ప్రస్తుతం జనరల్ అవ్వడంతో పొలిటికల్ లీడర్లలో ఆశలు మొదలయ్యాయి. పలువురు నాయకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల కోసం పనిచేసిన ఓ ఇద్దరి నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సిపిఐ పార్టీ మాత్రం పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 22 మండలాలు ఉండగా దుమ్ముగూడెం, గుండాల మండలాల్లో గెలిచిన వారికే జడ్పీ చైర్మన్ పీఠం దక్కే ఛాన్స్,అవకాశం ఉంటుంది.