
- 55 మంది గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు టీషర్ట్స్ అందజేసిన సమ్మి గౌడ్
కేసముద్రం,అక్టోబర్ 5, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మండలం కల్వల గ్రామం లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుండి భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాల కమిటీ ఆహ్వానం మేరకు కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు,సోదరీమణులు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు జిన్నా కిరణ్, ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్,కోశాధికారి మేకపోతుల మనీష్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి గండి బబ్బి,కమిటీ సభ్యుల తో కలిసి జై భవాని మాత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు చిలువేరు సమ్మయ్య గౌడ్.అనంతరం కమిటీ సభ్యుల కోరిక మేరకు 55 టీ షర్టులను బహుగకరించి వచ్చే ఏడాది భవాని మాత ప్రతిమను ఇప్పిస్తానని వారికి మాటిచ్చారు.ఈ సందర్భంగా సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ…ఆ జగన్మాత మాత ప్రత్యేక పూజలలో పాల్గొనే చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ఆ జగన్మాతకు అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని,ఆ తల్లి కల్వల గ్రామ ప్రజలను,యువతను ప్రతి ఒక్క కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి సంపదలతో సంపన్నులు అయ్యే విధంగా తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… మా ఆహ్వానం మేరకు పిలిచిన వెంటనే మా పై ప్రేమతో మా గ్రామం పై ఉన్న మక్కువతో పూజల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఆ జగన్మాత ఆశీస్సులు సమ్మయ్య గౌడ్ కి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని వారి ఆశయాలు ఆ తల్లి నెరవేర్చాలా చూడాలని ప్రజలందరికీ అండగా ఉండడమే కాకుండా తనను ఉన్నత స్థాయికి చేరే విధంగా ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సామల రాజు,అడ్డూరి శ్రీకాంత్,అడ్డూరి నవీన్, కూన పవన్,దిలీప్ చారి, విక్రమ్,మురళి,అరవింద్,గణేష్,రాజశేఖర్, శ్రీకాంత్,శ్రీను,వేణు, శ్రీపాల్,నరేష్,అజయ్, సాత్విక్,వినయ్,ప్రవీణ్, మనోజ్,గగన్,మహేష్, మనీష్,సాయి,వినయ్, కౌశిక్,గణేష్,కార్తీక్, వెంకటరెడ్డి,వెంకటేష్, అఖిల్,శ్రీకాంత్,సందీప్, శ్రీధర్,రాజు,నరేష్,వర్షిత్,వెంకటేష్,ప్రణయ్, కోటిరెడ్డి,రాజేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.