
- మాదిగ జాతికి డబ్బులు, పదవులు ముఖ్యం కాదు, ఆత్మ గౌరవమే ముఖ్యం
- ఎమ్మార్పీఎస్ ఉమ్మడి వెల్గటూర్ మండలం అధ్యక్షులు చెన్న కుమారస్వామి
ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, అక్టోబర్ 6 (న్యూస్ తెలంగాణ)::-జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇన్‌చార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించగా, అట్టి సమావేశానికి ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలస్యంగా హాజరు కాగా, ఈ క్రమంలో సభలో మనకు టైం అంటే తెలుసా.. జీవితమంటే తెలుసా.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ సహచర మంత్రిని ఉద్దేశించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి వెల్గటూర్ మండలం అధ్యక్షులు చెన్న కుమారస్వామి మండి పడ్డారు. ఈ సందర్భం పై జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి స్వామి వివేకానంద కూడలి వద్ద సోమవారం రోజున చెన్న కుమారస్వామి ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ… మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వాక్యాలను ఖండిస్తూ, ఈ వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ ను అవమానించినట్లే కాదు దళిత జాతిని అవమానించే విధంగా మాట్లాడారని, మాదిగ జాతికి డబ్బులు, పదవులు ముఖ్యం కాదు, ఆత్మ గౌరవమే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విషయంపై 24 గంటలలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాదిగ జాతికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణలు చెప్పని యెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి దిష్టి బొమ్మలు దహనం చేస్తామని, అవసరమైతే వారి ఇంటి ముట్టడికి కూడా వెనుకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకెనపల్లి సతీష్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మంతెన లక్ష్మణ్, తాడూరి హన్మయ్య గ్రామ శాఖ అధ్యక్షులు సుంకే తిరుపతి, లింగంపెల్లి నవీన్, సీపెల్లి సాగర్, ప్రవీణ్, వినోద్, రాజేందర్, శ్రీనివాస్, అరుణ్, రిషి తదితరులు పాల్గొన్నారు.