October 16, 2025
News Telangana
Image default
Telangana

కోట్ల విలువైన భూములు దర్జాగా కబ్జాలు..

  • కండ్ల ముందు కనిపిస్తున్న ఎందుకు కేసులు పెట్టరు…
  • అనుమతి లేకుండానే రెస్టారెంట్లు,స్పోర్ట్స్ క్లబ్లు…
  • ప్రభుత్వ భూములను కాపాడాలని సిపిఎం డిమాండ్…

అమీన్‌పూర్‌: అక్టోబర్ 6 (న్యూస్ తెలంగాణ)అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్న పట్టించుకునే నాధుడు లేడని సిపిఎం సీనియర్ నాయకులు నరసింహరెడ్డి అన్నారు. బీరంగూడ కిష్టారెడ్డిపేట ప్రధాన రహదారిపై గల ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 999లో జరుగుతున్న కబ్జాలను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్ల విలువ చేసే భూములు రియల్ ఎస్టేటర్లు,రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్న చూసి చూడనట్లుగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.సర్వే నెంబర్ 999 లో 13 ఎకరాల 13 గుంటల భూమి రికార్డుల ప్రకారం ఉందని అన్నారు.అయితే రెండు వైపులా ప్రైవేటు వ్యక్తులు చేసిన వెంచర్లలో ఇప్పటికే కబ్జాకు గురైందని,ఇప్పటికే ప్రభుత్వ భూమిలోకి జరిగి ఇంటి నిర్మాణాలు చేశారని, ఇంకా చేస్తున్నారని,విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ బిగిస్తున్నారని అన్నారు.ప్రస్తుతం ప్రధాన రహదారికీ అనుకొని ప్రైవేటు వ్యక్తులు రెవిన్యూ అధికారులు వేసిన ఫెన్సింగ్ తొలగించి,పెద్ద పెద్ద బోర్డులు పెట్టి అనుమతులు లేకుండా రెస్టారెంట్లు,ప్లే క్లబ్లు,స్పోర్ట్స్ క్లబ్బులు అనేక రకాలుగా వ్యాపారలు చేస్తున్నారని అన్నారు.పేదలు గుడిసె వేసుకోవడానికి గుంట భూమి ఇవ్వని ప్రభుత్వం, రాజకీయ అండదండలతో కోట్ల విలువచేసే భూములను ప్రైవేటు వ్యక్తులు అధికారులు వేసిన ఫెన్సింగ్ ను కూడా తొలగించి కబ్జాలు చేస్తుంటే ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.అనేకసార్లు రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ప్రభుత్వ భూమిలో వేసిన బోర్డులను తొలగించి,చుట్టూ ఫెన్సింగ్ వేయాలని,హెచ్చరిక బోర్డులు పెట్టాలని, కబ్జాదారులపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.లేదంటే ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు పాండురంగారెడ్డి,జార్జ్,శ్రీనివాస్ రెడ్డి,అంజిరెడ్డి,రమణయ్య, కిషోర్,రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

ధరణి రిపేరు షురూ..!

News Telangana

బ్రెయిన్ స్ట్రోక్ తో పోరాటం చేసి యువకుడు మృతి

News Telangana

1500 మంది పోలీస్ అధికారుల, సిబ్బంది తో ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు

News Telangana

Leave a Comment