
కేసముద్రం,అక్టోబర్ 6, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మండలం పీక్ల తండా కు చెందిన గూగులోత్ భాస్కర్( 40) కు ఇద్దరు కుమారులు అందులో ఒకరు ఎన్ఐటి లో బీటెక్ చదువుతున్నాడు, ఒకరు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అతనికి పీక్ల తండ శివారులో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.గత కొన్ని రోజులుగా కుటుంబ అవసరాలకు,పిల్లల చదువులకు డబ్బులు సరిపోక గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతూ,అక్టోబర్ 5,.2025 రాత్రి 09.30 గంటలకు అందరూ భోజనం చేసి పడుకొనగా తెల్లవారి జామున 05.00 గంటలకు భాస్కర్ భార్య లేచి చూడగా వాళ్ళ ఇంటి ముందు ఉన్న కొట్టం లో ఆమె చీరతో ఉరి వేసుకుని ఉన్నాడు అని భాస్కర్ భార్య గూగులోత్ సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి కిరణ్తెలిపారు.