
- దళిత సంఘాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముల్కల గంగారం
ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, (న్యూస్ తెలంగాణ):
మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ని దున్నపోతు అని అహంకార, భావంతో అవమానపరిచిన మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలి పట్ల దళిత సంఘాల నాయకుడు ముల్కల గంగారం దళిత సంఘాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ…. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని పాత్రికేయుల ముందు దున్నపోతు అని సంబోధించడం అవమానపరిచే విధంగా మాట్లాడడం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగ నాయకుడు అయినందున దున్నపోతు అనడం మాదిగల అందరిని అవమానపరిచిన సంఘటన మాదిగ జాతి మొత్తం తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నది ఈ విషయం పట్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందన కొరకు ఇంతసేపు చూసాము తాను చాలా బాధపడినట్లుగా కేవలం నేను మాదిగ కులం కు చెందిన నాయకున్ని కావడం వల్లనే నన్ను ఇంత అహంభావంతో పొన్నం ప్రభాకర్ దున్నపోతు అని అవమానపరచడం ఇంత సమయం గడిచిన కూడా ఇప్పటివరకు నాకు కనీసం ఫోన్ చేసి కూడా క్షమాపణ చెప్పలేదని బాధతో వీడియో రిలీజ్ అయిన తర్వాత వెంటనే దళిత సంఘాల తరఫున మేము స్పందిస్తా ఉన్నాం. అలాగే సహచర మంత్రిని అవమానపరిస్తే దళిత జాతికి సంబంధించిన మరో మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించలేదు ఖండించలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో స్పందించకపోవడం ఇది రెడ్డి మంత్రిని లేదా అగ్రవర్ణాలకు సంబంధించిన మంత్రిని అవమానపరిస్తే సీఎం రేవంత్ రెడ్డి స్పందించకుండా ఉండేవాడా లేదా ఇంకో మంత్రిని అదే పొన్నం ప్రభాకర్ ని దున్నపోతు అని సంబోధిస్తే ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకునేవాడా, వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేవారు కాదా చెప్పండి మాదిగ జాతి మొత్తం ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగల పట్ల ప్రేమ ఉంటే ప్రభుత్వం తరఫున ప్రభాకర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం, అలాగే పొన్నం ప్రభాకర్ వెంటనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే మాదిగ జాతి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నామని దళిత సంఘాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముల్కల గంగారం తెలిపారు.