
చిలుకూరు / న్యూస్ తెలంగాణ :-
మండల కేంద్రంలోని చిలుకూరు మాజీ ఎంపీపీ దొడ్డ సురేష్ బాబు (52) గుండెపోటుతో బుధవారం మృతి చెందారు, స్థానికుల తెలిపిన ప్రకారం, పని నిమిత్తం పట్టణంలోనే ఓ దుకాణంలో తన మిత్రులతో మాట్లాడుతుండగా, గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలారు. పక్కనే ఉన్న మిత్రులు సిపిఆర్ చేస్తూ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇటీవల స్వాతంత్ర సమరయోధుడు దొడ్డ నారాయణరావు రెండో కుమారుడు సురేష్ బాబు గత ఏడాది తల్లి సక్కుబాయమ్మ మృతి మూడు నెలల క్రితమే తండ్రి మృతి ఇప్పుడు కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. 2007-12 మధ్య కాలంలో చిలుకూరు ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం ఓ పార్టీ నుంచి జెడ్పిటిసి అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉండగా. ఇంతలోనే విషాదం నెలకొంది. ఆయనకు కుమారుడు కుమార్తె ఉన్నారు. సురేష్ బాబు మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.