
- ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి అన్వర్
మేడిపల్లి / న్యూస్ తెలంగాణ :- చేగువేరా స్పూర్తితో నేటి యువత తమ హక్కులకోసం ఉద్యమించాలని ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎండి అన్వర్ అన్నారు. గురువారం ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద చేగువేరా 58వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎండి.అన్వర్ మాట్లాడుతూ చేగువేరా పేరు వింటేనే నరనరాల్లో చైతన్యం ప్రవహిస్తుంది.యుద్దానికి సిద్దమై వెన్నెముక నిటారుగా చేగువేరా అని హృదయం కలవరిస్తుంది.దేహం నలుమూలల అణువణువు నిప్పు రవ్వై వెలిగిపోతుంది. దోపిడీకి గురవుతున్న ప్రజలకు విప్లవాత్మక మెడిసిన్ అవసరమని భావించి విప్లవకారుడిగా పరిణితి చెంది విప్లవ గెరిల్లా దళానికి నాయకుడయ్యాడు. క్యూబా స్వాతంత్య్రం కోసం ఆస్థమా వ్యాధిని సైతం లెక్క చేయకుండా చే నిజమైన గెరిల్లా నాయకుడయ్యాడు. బొలివియా ప్రజలను విముక్తి చేసే బాధ్యతని తన భుజాలపై వేసుకొని “కమ్యూనిస్ట్ గెరిల్లా దళాన్ని”స్వయంగా తయారు చేసుకుని విప్లవోద్యమాన్ని నిర్మించి నాయకత్వం వహించాడు.బొలివియా నియంత సైన్యాన్ని గడగడలాడించాడు.ఆయన పోరాట స్ఫూర్తితో నేటి విద్యార్ధి,యువత,”విద్యా, ఉపాధి,ఆర్థిక,సామజిక” అసమానతలపై పోరాటాలు కొనసాగించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అరవింద్, సాయి, నర్సింహా, సంతోష్, ప్రవీణ్, అవినాష్,శివ,సందీప్, హరి తదితరులు పాల్గొన్నారు.