
- డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి…
- దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి….
- మున్సిపల్ కార్యాలయంలో సిపిఎం వినతి పత్రం
అమీన్‌పూర్ / న్యూస్ తెలంగాణ :- అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రెండు పడకల గదుల అపార్ట్మెంట్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ రెవిన్యూ, శానిటేషన్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు నరసింహారెడ్డి మాట్లాడుతూ రెండు పడకల గదిలో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని డ్రైనేజీ వ్యవస్థ కుండిపోవడంతో విపరీతమైన దోమలు, దుర్వాసన రావడంతో ప్రజలు విష జ్వరాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆశ ఆశా వర్కర్ ని ఏఎన్ఎం ను నియమించాలని డిమాండ్ చేశారు. డ్రైవింగ్ వ్యవస్థను క్లీన్ చేయాలని అపార్ట్మెంట్ నుండి బయటకు పోయేటువంటి కాలువల పూడిక తీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాజేష్,ధనరాజు, ఎండి గౌస్,సతీష్,షకిర్ ఖాన్,హరీష్. తదితరులు పాల్గొన్నారు.