
కామారెడ్డి ప్రతినిధి / న్యూస్ తెలంగాణ :-
జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల అధికారిని రాణి కుముదిని హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పకడ్బందీగా జరగాలని, ముందుగానే క్షేత్ర స్థాయిలో సమీక్షించుకోవాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిఅధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో సహకరించాలని, సెన్సిటివ్ ప్రదేశాలలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 14 జడ్పిటిసిలు, 136 ఎంపిటిసి స్థానాల నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే ఆర్వో, ఏఆర్వో లకు శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగిందని, ఎంసీసీ బృందాలు అన్ని చురుగ్గా విధులు నిర్వహిస్తున్నాయని, గురువారం నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీగా ఏర్పాటు చేసుకోని సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ మరియు జెడ్పి సీఈఓ చందర్, డిఆర్వో సిహెచ్. మధుమోహన్, డిపిఓ మురళి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.