
ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, అక్టోబర్ 10 (న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బింగి సతీష్ అనే యువ కౌలు రైతు విద్యుత్ షాక్ కు గురై మరణించగా, వారి కుటుంబ సభ్యులను శుక్రవారం రోజున మాజీ మంత్రి కొప్పు ఈశ్వర్ పరామర్శించి, సతీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా…. పెద్దపల్లి జిల్లా విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ తో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబానికి సహాయం అందేలా చూడాలని కోరారు. అనంతరం వారి కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట ఎండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్, పార్టీ నాయకులు గాజుల మల్లేశం, మారం జలంధర్ రెడ్డి, చింతల తిరుపతి, పడిధం వెంకటేష్, ఉప్పు రాజయ్య, ముక్తి చెందు, మెతుకు స్వామి, గంధం లక్ష్మి నారాయణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.