
ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, అక్టోబర్ 10 (న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూర్ గ్రామ ముద్దు బిడ్డ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాస రావు (బాపు) పుట్టినరోజు వేడుక ఈనెల 13 సోమవారం రోజున ఉండగా, శుక్రవారం రోజున పలు పర్యటనలో భాగంగా ఉమ్మడి వెల్గటూర్ మండలానికి విచ్చేసిన పొనుగోటి శ్రీనివాసరావు కు ఆయన జన్మదిన వేడుకను పురస్కరించుకొని మండలంలోని రాజరాంపల్లి లో ముందస్తుగా జన్మదిన వేడుకలను గ్రామంలోని మహిళలు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయనతో కేక్ కట్ చేపించి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుని, శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు కేకుల తినిపించారు.