
- వీడియో కాల్ లో హర్షం వ్యక్తం చేసిన పొనుగోటి
ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, (న్యూస్ తెలంగాణ):
జన హృదయ నేత, ప్రజాభిమాని ఉమ్మడి వెల్గటూర్ మండల ప్రజలకు ఎవరికి ఏ ఆపద వచ్చిన నేనున్నానంటూ అందుబాటులో ఉంటూ అందరిని ఆదుకుంటు ఉమ్మడి మండల అభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషిస్తూ ముందుకు నడిపిస్తున్న, పాతగూడూరు గ్రామ ముద్దుబిడ్డ, ప్రజలు ప్రేమగా బాపు అని పిలిచే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, వెల్గటూర్ మండల మాజీ ఎంపీపీ పోనుగోటి శ్రీనివాసరావు (పీఎస్ఆర్) 60 వ జన్మదిన వేడుకలు ఆయన స్వగ్రామమైన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరులో సోమవారం రోజున జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ఆశీస్సులకై పుట్టినరోజు నాడు తిరుపతి వెళ్లిన పిఎస్ఆర్ కు వీడియో కాల్ చేసి తన అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంపదలతో మున్ముందు ఇంకా పై స్థాయికి ఎదగాలని కోరుకున్నారు, ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, వారందరి అభిమానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొంగల చంద్రారెడ్డి, కొయ్యడ శ్రావణ్, గంగాధరి మల్లేశం, కోట శ్రీశైలం, మొగిలి మల్లేశం, ముక్తి రాజేందర్, బోయిని సతీష్, నిమ్మ చంద్రయ్య, కొయ్యడ ఓదెలు, కొమురయ్య, శేశి, సాయి, శ్రావణ్, మల్లేశం, సతీష్, మహేందర్, సత్తయ్య, రాయలింగు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
