
- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు చోరి సంతక ప్రచార సమావేశంలో భారీగా పాల్గొన్న నియోజకవర్గం ప్రజలు

కుత్బుల్లాపూర్ / (న్యూస్ తెలంగాణ ప్రతినిధి లక్ష్మణ్):
కుత్బుల్లాపూర్ నియోజ కవర్గం పరిధిలోని గాజులరామారం సత్యగౌరి కన్వెన్షన్ లో నిర్వహించిన ఓటు చోరి సంతకం ప్రచార సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై నియోజకవర్గం ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు ఓటు చోరి పై అవగాహన కల్పించారు
అనంతరం సంతకాల సేకరణ లో భాగంగా కూన శ్రీశైలం గౌడ్ తో పాటు నియోజకవర్గం ప్రజలు,నాయకులు, కార్యకర్తలు సంతకాలు చేశారు
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ
ప్రజాసౌమ్యాన్ని ఖుని చేసేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి ప్రభుత్వన్ని మన ఏఐసీసీ ప్రియతమా నేత రాహుల్ గాంధీ అడ్డుకుంటున్నారు కాబట్టి వారికి అండగా మనం అందరం ఉండాలని కోరారు
ప్రజాసౌమ్య దేశంలో ఓటు హక్కు బలమైన శక్తి ఆ శక్తిని అంతం చెయ్యడం ఎవ్వరి తరం కాదని తెలిపారు
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రియతమానేత రాహుల్ గాంధీ దృఢసంకల్పంతో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకాతవకలు జరగకుండా ఉండేదుకు దేశం నలుమూలల ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది..
ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్, సెక్రటరీ విశ్వనాథన్,టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఈరోజు ఓటు చోరి సంతక ప్రచార సమావేశం నిర్వహించి ఒక్కరికి ఒక్క ఓటు మాత్రమే అని నియోజకవర్గం ప్రజలకు అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ లు, సంక్షేమా సంఘాల నాయకులు, యువజన నాయకులతో పాటు తదితరులు పాల్గోన్నారు