October 16, 2025
News Telangana
Image default
Telangana

గీతంలో నైతిక హ్యాకింగ్ పై నైపుణ్య శిక్షణ

పటాన్‌చెరు / న్యూస్ తెలంగాణ :-

గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లోని కృత్రిమ మేధస్సు-డైటా సైన్స్ (ఏఐ&డీఎస్) విభాగం ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు నైతిక హ్యాకింగ్ పై సాంకేతిక శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. గీతంలోని శిక్షణ, యోగ్యతాభివృద్ధి విభాగం ప్రోత్సహంతో, న్యూఢిల్లీలోని ఎడ్యు స్కిల్స్ సౌజన్యంతో, ఏఐ&డీఎస్ విద్యార్థి విభాగం హ్యాక్ ఆప్స్ క్లబ్ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు.

కోర్ ఇంజనీరింగ్ డీన్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల పర్యవేక్షణలో, ఏఐ&డీఎస్ విభాగాధిపతి డాక్టర్ వి. శిరీష నిర్వహణలో డాక్టర్ టి. శశివర్ధన్ ఈ మూడు రోజుల కార్యశాలను సమన్వయం చేస్తున్నారు. ఆచరణాత్మక నైపుణ్యాలు, సైబర్ భద్రత, నైతిక హ్యాకింగ్ పద్ధతులపై విద్యార్థులకు లోతైన అవగాహన కల్పించి, వారిని సన్నద్ధం చేసే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నారు.

0Shares

Related posts

Telangana Assembly | రేపట్నుంచి అసెంబ్లీ సమావేశాలు.. భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!

News Telangana

ముల్కనూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆస్తుల ఊసే కరువాయే..

News Telangana

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన సిద్ధిపేట అర్బన్ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ?

News Telangana

Leave a Comment