October 16, 2025
News Telangana
Image default
Telangana

అమీన్పూర్ డబల్ బెడ్ రూమ్ వాసులకు బస్సు సౌకర్యం కల్పించాలి…

  • మియాపూర్ బస్ డిపో మేనేజర్ కు సిపిఎం వినతిపత్రం..

అమీన్‌పూర్‌ / న్యూస్ తెలంగాణ :-

అమీన్పూర్ మున్సిపాలిటీలోని 2 బి హెచ్ కె డిగ్నిటీ హౌసింగ్ కాలనీ వాసులకు బస్సు సౌకర్యం కల్పించాలని మియాపూర్ బస్ డిపో మేనేజర్ వెంకటేష్ కు కాలనీవాసులతో కలిసి సిపిఎం వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం నాయకులు నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, డబల్ బెడ్ రూమ్ హౌసింగ్ కాలనీలో దాదాపు1500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని అన్నారు వీరంతా హైదరాబాద్ సిటీలోని అనేక ప్రాంతాలలో నివాసం ఉండేవారని, వీరికి ప్రభుత్వం అమీన్పూర్ లో ఇల్లు కేటాయించడంతో వచ్చినటువంటి పేదలని, అక్కడ పనులు చేసుకుంటున్న వీరికి ఇక్కడ నుండి పోవడానికి రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న వీరు ప్రైవేటు వాహనాలను ఎక్కడ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతున్నాయని అన్నారు. రోజు వందలాదిమంది విద్యార్థులు, ప్రవేటు పరిశ్రమలలో, షాపింగ్ మాల్స్ లో,విద్యాసంస్థలలో, హాస్పిటల్స్ లో, కార్యాలయాలలో, ఇంటి పని వాళ్లు గా పనిచేస్తున్నారని అన్నారు. వీరికి వచ్చే జీవితంలో సగం ప్రయాణ ఖర్చులకే సరిపోతుందని ఆవేదన చెందారు. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు వీరి ఇబ్బందులను గమనించి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మియాపూర్ బస్ డిపో మేనేజర్ వెంకటేష్, రూట్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ స్పందించి తప్పకుండా మీ సమస్య పరిష్కరించడం కోసం కృషి చేస్తానని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఇప్పటికే మా బస్సులు బీరంగూడ పటేల్ గూడా వెళ్తున్నాయని ఆ రూట్ లో కూడా నడపడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిపిఎం శ్రీనివాస్ రెడ్డి కాలనీవాసులు ధనరాజ్ వైవి రవి నగేష్ సతీష్ కుమార్ అబ్దుల్ హనీష్ తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

దళితులపై దాడులు .. ఆపై కేసులు

News Telangana

మేకల రాములు యాదవ్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఈస్ట్ బోడుప్పల్ యాదవ సంఘం.

News Telangana

ఘోర రోడ్డు ప్రమాదం బస్సు బోల్తా. 30 మందికి తీవ్ర గాయాలు

News Telangana

Leave a Comment