
- పోస్టాఫీస్ ఆధ్వర్యంలో స్కానర్‌ల పంపిణీ
రాయికల్ / న్యూస్ తెలంగాణ :-
రాయికల్ పట్టణ కేంద్రంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్లకు డిజిటల్ ఆన్‌బోర్డింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోస్టాఫీస్ ఆధ్వర్యంలో స్ట్రీట్ వెండర్లకు డిజిటల్ లావాదేవీల సౌలభ్యం కోసం స్కానర్‌లను పంపిణీ చేశారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ ప్రధాన అతిథిగా పాల్గొని,డిజిటల్ పద్ధతులు అవలంబించడం వల్ల వ్యాపారంలో పారదర్శకతతో పాటు ఆర్థిక లావాదేవీలలో సౌకర్యం పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మెప్మా టి.ఎం.సి శరణ్య, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారిని కళ్యాణి,
ఆర్పీలు,స్థానిక స్ట్రీట్ వెండర్లు పాల్గొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు పట్టణంలోని చిన్న వ్యాపారులకు డిజిటల్ యుగంలో అడుగుపెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు.