
కామారెడ్డి ప్రతినిధి / న్యూస్ తెలంగాణ :-
రాజీవ్ గాంధీ నగర్లోని కన్స్ట్రక్షన్ సంస్థలో గతంలో హెల్పర్గా పనిచేసిన ఓ కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటకి చెందిన నర్సారెడ్డి నారాయణరెడ్డి (44) కుటుంబంతో నగరానికి వలస వచ్చి, ఓ ప్రైవేటు కన్స్ట్రక్షన్ కంపెనీలో హెల్పర్గా పనిచేస్తుండేవాడు. మద్యానికి బానిసవడంతో కుటుంబంలో తగాదాలు తలెత్తాయి. దీంతో భార్య లలిత గత కొంతకాలంగా అతనికి దూరంగా ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. నెల రోజుల క్రితం కంపెనీ యాజమాన్యం అతన్ని విధుల్లో నుంచి తొలగించింది. భార్యాపిల్లల ఎడబాటుతోపాటు, కంపెనీ యాజమాన్యం విధుల్లో నుంచి తొలగించడంతో జీవితంపై విరక్తి చెందడంతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన భర్త ఆత్మహత్యకు కారణం తెలపాలంటూ మృతుడి కుటుంబసభ్యులు సంస్థ ముందు ఆందోళన చేపట్టారు.