
న్యూస్ తెలంగాణ / మేడ్చల్ -మల్కాజ్గిరి :-
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) కేంద్ర సహాయం NSAPలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు, వారి కుటుంబ ప్రధాన జీవనాధారదారుడు (మహిళ/పురుషుడు) మరణించిన సందర్భంలో, కుటుంబ పోషణ నిమిత్తం బాధిత కుటుంబానికి ఒకేసారి రూ. 20,000/- (ఇరవై వేలు రూపాయలు మాత్రమే) సహాయంగా అందించబడుతుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కుటుంబ ప్రధాన జీవనాధారదారుడి వయస్సు 18 సంవత్సరాలకు మించి 60 సంవత్సరాల లోపు ఉన్న వారు మరణించిన సందర్భంలోఈ పథకం కుటుంబ ప్రధాన జీవనాధారదారుడు పై ఆధారపడి ఉన్న జీవిత భాగస్వామి మైనర్ పిల్లలు, పెళ్లికాని కుమార్తెలు మరియు ఆధారపడిన తల్లిదండ్రులు, మైనర్ సోదరులు/సోదరీమణులు కుటుంబంగా పరిగణిస్తూ బాధిత కుటుంబానికి ఒకేసారి 20 వేలరూపాయలు ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతుందన్నారు.
తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబం మాత్రమే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత కలిగి ఉండి వితంతువు మరియు/లేదా మైనర్ పిల్లలను ఎస్సీ/ఎస్టీ గృహాలకు చెందిన కుటుంబాలు, మైనర్ పిల్లలు అనాథలుగా ఉన్న కుటుంబాలకు, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది మైనర్ పిల్లలు వైకల్యంతో ఉన్న కుటుంబాలకు, ఒకే ఒక్క బిడ్డ ఆడపిల్ల అయిన కుటుంబాలకు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది మైనర్ పిల్లలు అందరూ బాలికలే ఉన్న కుటుంబాలకు, ఒకే బిడ్డ ఉన్న కుటుంబాలకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు, మైనారిటీలు మరియు బిసి/ఓసి వర్గాలకు చెందిన కుటుంబాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అర్హులైన వారు పరిధిలోని మండల తహాసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజనం పథకం కింద లబ్ది పొందాలని మంగళవారం ఒక ప్రకటనలో కలెక్టర్ సూచించారు.