
- జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నర్సిములు
న్యూస్ తెలంగాణ / సంగారెడ్డి జిల్లా :-
భక్తుల వీరప్ప దంపతులపై దాడి చేసిన ఘటన విషయంలో వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నర్సిములు..
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వీరశైవ లింగయత్ సమాజం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇప్పపల్లి నర్సిములు, సమాజ పెద్దలు నాయికోటి రామప్ప సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ గారికి పిర్యాదు ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా ఇప్పపల్లి నరసింహులు మాట్లాడుతూ ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం జరిగితే ఉపేక్షించేది లేదని అన్నారు. వారితో పాటు
సంగారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు ఏ రేవని సిద్దప్ప, ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల శివకుమార్, యువజన ప్రధాన కార్యదర్శి నవీన్ రామోజి, సదాశివ పేట మండల అధ్యక్షులు నాగేశ్వర్, అశోక్, రవి తదితరులు ఉన్నారు.