
- నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మానుకోట శాసనసభ్యులు మురళి నాయక్
కేసముద్రం,అక్టోబర్ 15, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో బుధవారం నూతన గ్రామ నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ… ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద గ్రామపంచాయతీ నూతన భవనానికి 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని,ఈ భవనాన్ని నాణ్యతతో నిర్మించి త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని,గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంట. సంజీవరెడ్డి,తహశీల్దార్ వివేక్,ఎంపీడీవోజె. క్రాంతి,జిల్లా ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం. నాగేశ్వరరావు,మాజీ పీసీసీ సభ్యులు దసురు నాయక్,మాజీ సింగిల్ విండో చైర్మన్ బండారు వెంకన్న,బండారు దయాకర్,మాజీ సర్పంచ్ మంగ యాకన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్రావు,మాజీ సర్పంచ్ మంగ సుజాత యాకన్న,మాజీ వార్డు సభ్యులు దుండి మధుకర్,మార మోహన్ రెడ్డి,ఎలుక పద్మ,గౌడ సంఘం అధ్యక్షులు రాంపల్లి వెంకన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు భూక్య సుశీల రామ్ దన్,గుగులోత్ శీను,అయిత సరస్వతి, ముఖ్య నాయకులు భూక్య వెంకన్న నవీన్ కరుణాకర్ మంగ వెంకన్న,బొమ్మినేని శ్రీనివాస్ రావు,లింగాల శ్రీనివాస్ రెడ్డి,సొల్లేటి జ్యోతి,ఇట్టే పిచ్చమ్మ, వెంకట్ రెడ్డి,
గుగులోత్ శ్రీను,మల్లయ్య,అయిత సారయ్య,గాదె శ్రీనివాస్, కార్యదర్శి శైలజ లు పాల్గొన్నారు.