
కేసముద్రం,అక్టోబర్ 15, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మున్సిపాలిటీలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల రెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…
“డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఓ ప్రేరణ.సాధారణ కుటుంబంలో పుట్టి, కఠిన శ్రమతో దేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. విద్యార్థులు ఆయనలా పెద్ద కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలి.కలాం చెప్పిన కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’అనే వాక్యాన్ని జీవితమంతా మంత్రంలా మార్చుకోవాలి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.