
మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకులపాఠశాల రఘునాథపాలెం(బాలురు)లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి లివిన్ స్టన్ తయారుచేసిన సోషల్ స్టడీస్ మంత్లీ మ్యాగజిన్ నీ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీ గురుకులాల ఆర్ సి ఓ రాంబాబు ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ నేటి సోషల్ మీడియా యుగంలో ఉపాధ్యాయులకు సృజనాత్మకత అవసరమని అది బోధనలో సులభతరం చేస్తుందని విద్యార్థులని ఆకట్టుకుంటుందని అన్నారు. లివింగ్ మాట్లాడుతూ ఆర్ సి ఓ చేతుల మీద ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉంది అని మరియు మ్యాగజిన్ తయారీ చేయటానికి నన్ను ప్రోత్సహించిన మా పాఠశాల ప్రిన్సిపాల్ రాము కి ఏటీపీ భాషా సార్ కి తోటి ఉపాధ్యాయుల అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రాము పాల్గొన్నారు