
- నూతన రామ మందిర నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ

న్యూస్ తెలంగాణ / సంగారెడ్డి జిల్లా ప్రతినిధి :-
బొల్లారం మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ రామ మందిరం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం బొల్లారం మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ హనుమాన్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందించడంలో దేవాలయాల నిర్మాణాలు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా సొంత నిధులతో 200 దేవాలయాలు నిర్మించడం జరిగిందని తెలిపారు.