
- అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి .. నీలం మధు ముదిరాజ్

న్యూస్ తెలంగాణ / సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:- పటాన్ చెరు లో ఏఐసీసీ అబ్జర్వర్ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం..కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ..కార్యకర్తలు, మండల, బ్లాక్ స్థాయి అధ్యక్షుల అభీష్టం మేరకే సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నియామకం జరుగుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.బుధవారం అశోక్ నగర్ లోని సితార గ్రాండ్ హోటల్ లో ఏఐసీసీ అబ్జర్వర్ సజరిట లైత్ ప్లాంగ్, పీసీసీ అబ్జర్వర్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు గార్ల ఆధ్వర్యంలో పటాన్ చెరు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో నీలం మధు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘటన్ సృజన్ అభియాన్ లో భాగంగా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడం శుభపరిణామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా పార్టీ కోసం కష్టపడే నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకునే వెసలుబాటు కలుగుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గలా బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేసే అధ్యక్షుడికి మనమంతా సంపూర్ణంగా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించిన మనమంతా కలిసి పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు ముజాహిద్ ఆలం ఖాన్, గాలి అనిల్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, శశికళ యాదవరెడ్డి, INTUC జిల్లా అధ్యక్షులు నరసింహ రెడ్డి, బ్లాక్, మండల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..