October 16, 2025
News Telangana
Image default
Crime NewsTelangana

తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్, డిసెంబర్ 01 ( న్యూస్ తెలంగాణ ) :
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాల యంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అటవీశాఖ కీలక ఫైళ్లు మంటల్లో తగులబడ్డాయి. శుక్రవారం తెల్లవారు జామున మూడు గంటలకు అగ్ని ప్రమాదం జరిగితే ఇవాళ సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షార్ట్ సర్క్యూట్‌తోనే మంటలు అంటు కున్నాయని అధికారులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ సమయంలో మంత్రితో ఎండి తిరుమలకు వెళ్లనందుకు అతడిపై వేటు పడింది. ఇటీవలే పర్యాటక శాఖ ఎండి మనోహర్‌ను ఇసి సస్పెండ్ చేసింది. పర్యాటక శాఖలో అగ్ని ప్రమాదంపై సిపిఐ నారాయణ అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారుతుండడంతో అగ్ని ప్రమాదం కుట్ర జరిగిందని, కీలక ఫైల్స్ కాలటంపై అనుమానులు ఉన్నాయని నారాయణ మండిపడ్డారు. హైలెవల్ ఎంక్వైరీ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.

0Shares

Related posts

వసూళ్ల కు అడ్డా … వాంకిడి చెక్ పోస్ట్

News Telangana

పురుగుల మందు తాగి యువకుడు మృతి

News Telangana

భారీగా గంజాయి పట్టివేత

News Telangana

Leave a Comment