October 16, 2025
News Telangana
Image default
Telangana

ముస్తాబాద్ లో ఇసుక మాఫియా పోలీసులపై దాడి

  • అర్థరాత్రి పూట ఇసుక ట్రాక్టర్ ల ఆగమాగం.
  • అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు
  • ట్రాక్టర్ ను పోలీసు స్టేషన్కు తరలిస్తున్న సమయంలో ఘటన
  • ట్రాక్టర్ ని పట్టుకున్న కానిస్టేబుల్ పై దాడి
  • పోలీసు ఉన్నతాధికారులు ఇసుక మాఫియాను అరికట్టాలి.

ముస్తాబాద్ //న్యూస్ తెలంగాణ :-

రోజురోజుకు ఇసుక మాఫి ఆగడాలు జరుగుతున్నాయి. తాజాగా ముస్తాబాద్ మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ లను పట్టుకున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన పెంటం చందు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతారో ఏమో అని కరీంనగర్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగ గ్రామం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముస్తాబాద్ ఎస్.ఐ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.అదే సమయంలో అర్థ రాత్రి పూట ఇదే మండలం రామ లక్ష్మణ పల్లె తో పాటు మరో గ్రామానికి చెందిన అయిదు ట్రాక్టర్లు ఇసుక ను నింపుకొని ముస్తాబాద్ వెళ్ళే క్రమంలో అక్కడ పోలీస్ బందోబస్తు ఉన్న బ్లూ కోర్టు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అయిదు ఇసుక ట్రాక్టర్ లు బ్లూ కోర్టు కానిస్టేబుల్ సత్యనారాయణ కు తారసపడగా ఇట్టి విషయం పికేటింగ్ లో అక్కడే ఉన్న ముస్తాబాద్ ఎస్.ఐ కి సమాచారం ఇవ్వగా ట్రాక్టర్ల వద్దకు వచ్చిన ఎస్.ఐ, బ్లూ కోర్టు కానిస్టేబుల్ సత్యనారాయణ ను రామ లక్ష్మణ పల్లె కు చెందిన ఓ ఇసుక ట్రాక్టర్ పై ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తీసుకురావాలని చెప్పినట్లు సమాచారం. ఎస్ ఐ ఆదేశాల మేరకు సదరు కానిస్టేబుల్ ట్రాక్టర్ పై కుర్చోగా ట్రాక్టర్ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా కానిస్టేబుల్ తో సహా ట్రాక్టర్ ను నామాపుర్ చెరువులో తోసి వేశాడు. దీంతో సత్యనారాయణ అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కాగ అతడిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ తగినంత చికిత్స అందించకపోవడం తో కరీంనగర్ నుండి హైదరాబాద్ కు తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం డ్రైవర్ పరార్ లో ఉన్నట్లు సమాచారం. ముస్తాబాద్ మండలంలో గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఇసుక మాఫియాను అరికట్టాలను గ్రామస్తులు కోరుతున్నారు.

0Shares

Related posts

మంత్రులకు గజమాలతో ఘనంగా స్వాగతం

News Telangana

క్రికెట్ క్రీడల విజేతలకు బహుమతులు పంపిణి

News Telangana

ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి రాష్ట్ర ఎన్నికల అధికారిని రాణి కుముదిని

News Telangana

Leave a Comment