
- దేవుడి భూముల్లో గుప్త నిధుల మాయజాలం
- వృత్తి ముసుగులో గుప్తనిధుల వేట
- ఎద్దడుగులో ఏముంది ?
- లక్కాకులమ్మ నీ నిధులు ఎవరికి లభ్యం..?
- అరణ్యంలో అధికారే దిక్సూచి
- గుప్త నిధుల గుర్తింపు పరికరాలతో ఎద్దడుగులో నాయక్ సాబ్
- దేవుడు భూముల వేటలో వద్దన్న వారిని తొలగించిన వన్య కాపరి
- ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎవరెస్టు దందా
ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో చీఫ్/ఫిబ్రవరి 13:హనుమకొండ జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారి గుప్తనిధుల వేటకై అటవీ శాఖ వాచర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను సలహా కోరగా దేవుడు భూమిలతో ఆటలు వద్దన్న వారిని తొలగించి అదే ఊరికి మరియు అటవీ ప్రాంతానికి దగ్గరలో సొంత బావులు ఉన్న ఒకే కులానికి చెందిన ఇద్దరు వ్యక్తులను నూతనంగా నియమించి,ఇతర రాష్ట్రాల నుంచి గుప్త నిధులను గుర్తించడానికి ఏర్పాటు చేసిన పరికరాలను తీసుకొచ్చినట్టుగా గుసగుసలాడుతున్న ప్రజలు సొంత. అయితే చుట్టూ వనానికి ఆయు పట్టుగా లక్కాకులమ్మ దేవస్థానం, ఎద్దడుగు శ్రీ మల్లికార్జున స్వామి ఆనవాళ్లు ఉండడంతో ప్రతి ఏడు శ్రావణమాసంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను వాచర్లుగా నియమించుకున్న అటవీశాఖ అధికారి.అధికారిది మరియు వాచర్లది ఒకే క్యాస్ట్ అంటున్న స్థానికులు.దీనిపై దాదాపు 2024 డిసెంబర్ నుండి కసరత్తు చేస్తున్న అటవీ శాఖ అధికారట. ఇంటలిజెన్స్ నిఘాలో కూడా ఈ అంశం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఎన్నడూ లేని విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి కూడా గుప్తనిధుల వేటకై సొంత వ్యక్తులను నియమించుకొని దైవస్థాన భూముల పరిధిలో వనం చుట్టూ ఏదేచ్ఛగా సోదాలు నిర్వర్తిస్తున్న అధికారిపై రానున్న రోజుల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ప్రజల నాడి.అసలు గుప్తనిధుల వేట జరిగిందా..? లేదా గుప్త నిధుల వేటకై రంగం సిద్ధం చేశారా, అసలు ఉన్నటువంటి వాచర్లను తీసేసి కొత్త వాళ్లను నియమించుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి…? పదేపదే ఆ అధికారిపై ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి…? దీనిపై సమగ్ర సమాచారంతో మీ ముందుకు మీ న్యూస్ తెలంగాణ..