October 16, 2025
News Telangana
Image default
Telangana

వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే – ఏకంగా ప్రాణమే పోయింది

  • ఠాగూర్ సినిమా పునరావృతం
  • ఫోన్ లో ట్రీట్మెంట్ చెప్పిన డాక్టర్
  • ఆయన సూచనతో ఇంజెక్షన్ చేసిన కాంపౌండర్
  • ప్రాణాలు కోల్పోయిన పేషెంట్
  • డోస్ ఎక్కువ ఇవ్వడం వల్లనే నిండు ప్రాణం పోయింది అంటున్న బందువులు
  • సెటిల్మెంట్ పేరుతో గంటలకొద్దీ కాలయాపన

కోదాడ ప్రతినిధి ,ఫిబ్రవరి 20:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చందన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వరరావు (44) దగ్గు,ఆయాసం సమస్యతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు కోదాడలోని శ్యామల నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు.అందుబాటులో వైద్యుడు లేకుండానే హాస్పిటల్ సిబ్బంది చికిత్స చేసి ఇంజక్షన్ ఇవ్వడంతో కాసేపటికి నాగేశ్వరరావు మృతి చెందాడు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నాగేశ్వరరావు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుని బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.

0Shares

Related posts

ఘనంగా యువ నేత యాకాంతం గౌడ్ జన్మదిన వేడుకలు

News Telangana

ప్రజా ప్రభుత్వం లో వరి ధాన్యం కొనుగోలు

News Telangana

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

News Telangana

Leave a Comment