October 17, 2025
News Telangana
Image default
PoliticalTelangana

తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

  • గ్రామ శాఖ అధ్యక్షుడిగా షేక్ జహూర్
  • ఉపాధ్యక్షుడిగా షేక్ అమీన్ సాహెబ్
  • జనరల్ సెక్రెటరీగా కొండా దుర్గా శంకర్
  • ట్రెజరీగా కొండా శిరీష

చింతకాని / మే 15 / న్యూస్ తెలంగాణ :- తెలుగుదేశం పార్టీ వందనం గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం వందనం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు గ్రామ తెదేపా సీనియర్ నాయకులు షేక్ అమీన్ సాహెబ్ అధ్యక్షతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు కమిటీ పేర్లు మరియు పదవుల వివరాలు తెలిపారు. అధ్యక్షుడిగా షేక్ జహుర్, ఉపాధ్యక్షుడిగా షేక్ అమీన్ సాహెబ్, జనరల్ సెక్రెటరీగా కొండా దుర్గా శంకర్, ట్రెజరీగా కొండా శిరీష ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నిక అనంతరం షేక్ జహుర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ గుండె పోటుతో మృతి

News Telangana

24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై సవాల్‌!

News Telangana

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన అఖిలపక్ష నాయకులు

News Telangana

Leave a Comment