
- మృత దేహం తో గ్రామస్తుల ధర్నా
- బాధితుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

ఎండపల్లి రిపోర్ట్ ఉప్పు రమేష్, సెప్టెంబర్ 24 (న్యూస్ తెలంగాణ):
రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ చర్లపల్లి, గుల్లకోట గ్రామస్థులు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామ జగిత్యాల చౌరస్తా వద్ద మృత దేహంతో ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే…. చర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం రవి గౌడ్ (45) గత శనివారం రోజున గుల్లకోట వైకుంఠధామం వద్ద జరిగిన టాటా ఏసీ బైక్ ను ఢీ కొన్న ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలు కాగా, కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు . మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తున్న క్రమంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, మృతుడు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని రవి గౌడ్ మృతితో కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయారని వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఇరు గ్రామాల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం సమయంలో రాజరాంపల్లి చౌరస్తా వద్ద అంబులెన్స్ లోని మృత దేహంతో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని ఉమ్మడి వెల్గటూర్ ఎస్సై ఆర్ ఉమాసాగర్ బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.