
ఎండపల్లి రిపోర్ట్ ఉప్పు రమేష్, (న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన వాడ్కాపురం శ్రీనివాస్ గత 18 నెలల క్రితం మరణించగా, వారి కుటుంబ సభ్యులు ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కటిక పేదరికంతో బాధపడుతున్నారు. మృతుడు శ్రీనివాస్ కు తల్లి, భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. వారి దీనస్థితికి అండగా అదే గ్రామానికి చెందిన, బీజేపీ నాయకులు కోదురుపాక అశోక్, మాజీ ఉపసర్పంచ్ అరిగేల స్వామి, బీజేవైఎం జిల్లా సీనియర్ నాయకులు తిరుమల ప్రమోద్ లు వారి మిత్రుడి మహమ్మద్ బాబర్ జన్మదినం సందర్బంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు నెలకి సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులను అందజేసి బాసటగా నిలిచారు. భవిష్యత్తు లో వారు పిల్లల చదువలకు సైతం సహాయం అందిస్తామని హామీ ఇచ్చి మనో ధైర్యాన్ని అందించారు.