
- విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు వెల్లడి
న్యూస్ తెలంగాణ / సంగారెడ్డి జిల్లా ప్రతినిధి :-
సదాశివపేట పట్టణాభివృద్ధికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న, మాజి మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ మాజి వైస్ చైర్మన్ చింతా గోపాల్ లు అన్నారు. గురువారం సదాశివపేట పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో రూ పది కోట్లు పనులకు ఈనెల 7న టెండర్లు పిలవబడిందన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ముఖ్యమంత్రి నిధుల ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రూ 25 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అందులో మొత్తం 324 పనులకు గాను 208 పనులకు మాత్రమే ప్రభుత్వం రూ 13 కోట్లు మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబించి సదాశిపేట పట్టణ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కోడూర్ అంజయ్య, అక్బర్ హుస్సేన్, ఇంద్ర మోహన్ గౌడ్, నాగుల విజయ్ కుమార్, నాగనాథ్, బరాడి శివ, నాసీర్, వాదోని రాజు, జబ్బర్, దిడిగే నాగేష్, ఫణి, కామేల్, ఆయుబ్ తదితరులు పాల్గొన్నారు.