
- ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కేసులు పెట్టాలి….
- పెద్దలు ఆక్రమిస్తే వదిలేస్తారు, పేదలు వేసుకుంటే కేసుల…
- సిపిఎం నాయకులు నాయిని నరసింహారెడ్డి…
అమీన్‌పూర్ / న్యూస్ తెలంగాణ :-
అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ భూము లను పరిరక్షించాలని,ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని, ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ఆధారంగా ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, సిపిఎం సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి పట్టాదారులతో కలిసి తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు అండదండలతో ఆక్రమించి వెంచర్లు చేసి అమ్ముకుంటే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు పట్టా సర్టిఫికెట్లు ఉన్న పేదలు ఇల్లు నిర్మిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు.సుల్తాన్పూర్ గ్రామంలోని 381 సర్వే నెంబర్ లో గత పాలకులు ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం ఇవ్వడం జరిగింది అని అన్నారు.అట్టి స్థలంలో అనేక సంవత్సరాలుగా గుడిసెలు,రేకులు వేసుకొని ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా అట్టి రేకుల ఇళ్లను కూల్చివేసి పేదలపై కేసులు పెట్టడం జరిగిందన్నారు.కానీ అదే సర్వే నెంబర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది పెద్దలు కబ్జాలు చేసి దర్జాగా నిర్మాణాలు చేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూములను కాపాడాలనీ,కబ్జా దారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్ రెడ్డి,జిలాని, సుల్తాన్పూర్ గ్రామస్తులు యాదయ్య,ఆంజనేయులు,కిష్టయ్య, అరుణ,జ్యోతి,లక్ష్మి,పద్మ తదితరులు పాల్గొన్నారు.