
రాయికల్ / న్యూస్ తెలంగాణ :-
తెలంగాణ రాష్ట్ర పరిశోధన శిక్షణ సంస్థ “విద్యార్థుల యొక్క విద్యాపరమైన అభివృద్ధిలో కౌన్సెలింగ్ యొక్క పాత్ర” అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా పరిశోధన పత్రాలు ఆహ్వానించగా, రాయికల్ మండలంలోని కుమ్మరి పల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ “విద్యార్థులలో ఉత్తమ ప్రవర్తనా మార్పులను పెంపొందించుట” అనే అంశంపై రూపొందించిన పరిశోధన పత్రం ” ఒత్తిడి నుండి విజయం వైపు – సమస్యల నుండి పరిష్కారాల వైపు” ఎంపిక కావడం జరిగింది. ఈ నెల 15 వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే సెమినార్ లో అభయ్ రాజ్ తన పరిశోధన పత్రం ప్రదర్శించనున్నారని మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు తెలిపారు. ఈ సందర్భంగా అభయ్ రాజ్ ను జిల్లా విద్యాధికారి రాము, సెక్టోరియల్ అధికారులు సత్యనారాయణ, రాజేష్, మహేష్, పీఆర్ టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పొన్నం రమేష్, కుంబాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, మండల అధ్యక్షులు అంతడుపుల గంగారాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్య, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు దేవలక్ష్మి, ఉపాధ్యాయులు హరికృష్ణ, వినోద్, తదితరులు అభినందించారు.